JMM నేత హేమంత్ సోరెన్ గురువారం మరోసారి జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హేమంత్ సోరెన్ తో ప్రమాణం చేయించారు. జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా బుధవారం సీఎం చంపయీ సోరెన్ నివాసంలో సమావేశమై హేమంత్ సోరెన్‌ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంగా హేమంత్ మూడోసారి పగ్గాలు చేపట్టారు.