GHMC కమిషనర్ ఆమ్రపాలికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్ ఏరియాలో కొండ రాళ్లను రాత్రి పగలు తేడా లేకుండా పేలుస్తున్నారని పలు మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై హైకోర్టు సీజేకి జడ్జి నగేష్ భీమపాక లేఖ రాశారు. దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన కోర్టు ఇవాళ భూగర్భ శాఖ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిలతో పాటు, HYD కలెక్టర్, GHMC కమిషనర్ లను ప్రతి వాదులగా చేర్చి పేలుళ్లపై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది.