ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు నమోదు చేయడంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని కోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు. అయితే తాజాగా కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ హైకోర్టు తిరస్కరించింది.