Homeహైదరాబాద్latest NewsBREAKING: రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర ఇంటి వద్ద హైటెన్షన్.. కారణం ఇదే..!

BREAKING: రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర ఇంటి వద్ద హైటెన్షన్.. కారణం ఇదే..!

రాయదుర్గం లోని ఓరియన్ విల్లాస్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర ఇంట్లోకి వెళ్లేందుకు ఎక్సైజ్ అధికారుల ప్రయత్నించారు. ఐతే.. ఈ విషయం తెలిసి భారీగా వచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. అధికారులను అడ్డుకున్నారు. దాంతో అధికారులు ఇంటి తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. వారిని నేతలు మరింతగా అడ్డుకోవడంతో.. అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంట్లో భారీగా విదేశీ మద్యం ఉండొచ్చని తమకు అనుమానం ఉంది అనీ, తనిఖీలు చెయ్యాల్సి ఉందని అధికారులు చెబుతుంటే.. అలాంటివేవీ లేవు అని బీఆర్ఎస్ నేతలు అడ్డుకొంటున్నారు. తమ లాయర్ సమక్షంలోనే తనిఖీలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐతే.. ఎక్సైజ్ పోలీసుల్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం కలకలం రేపుతోంది. తమ దగ్గర సెర్చ్ వారెంట్ ఉంది అని అధికారులు అంటున్నారు.

Recent

- Advertisment -spot_img