Homeహైదరాబాద్latest NewsBREAKING: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య భారీ ఘర్షణ.. రాళ్లతో పరస్పర దాడులు

BREAKING: టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య భారీ ఘర్షణ.. రాళ్లతో పరస్పర దాడులు

హోం ఓటింగ్ విషయంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో జరిగింది. హోం ఓటింగ్ విషయంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి, రావిపాటి నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. వైసీపీకి చెందిన కందుల నరసింహరావు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img