ఇప్పటివరకు GHMC పరిధిలో కూల్చివేసిన ఆక్రమణ వివరాలను హైడ్రా వెల్లడించింది. జూన్ 27 నుంచి ఇప్పటివరకు హైడ్రా 262 ఆక్రమణలను కూల్చివేసినట్లు తెలిపింది. మొత్తం 111.72 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్లో 54 నిర్మాణాలు కూల్చివేసినట్లు తెలిపింది. రాజేంద్రనగర్ 45, మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో 42 నిర్మాణాలు తొలగించినట్లు పేర్కొంది.