బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశ తప్పలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఆమె డిఫాల్ట్ బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. అయితే ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 5కు విచారణ వాయిదా వేసింది. ఈసారి ఎలాగైనా బెయిల్ వస్తుందని భావించిన ఆమె మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.