ఇదే నిజం, తెలంగాణ: ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. లోక్ సభ ఎలక్షన్స్ లో సింగల్ సీటు కూడా ఆయన పార్టీకి రాలేదు. తెలంగాణకే ఆయన పేరు ఒక బ్రాండ్. ఆయన స్థానంలో వేరే లీడర్ ఉంటే హాయిగా రిలీఫ్ కోసం ఈ పాటికి ఏ విదేశీ యాత్రకో చెక్కేసే వారు. కాని ఆయన కేసీఆర్. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పరాజయాలు, ఎన్నో అవమానాలు ఎదుర్కొని వచ్చాడు. ఈ గెలుపోటములు ఆయనకు కొత్త కాదు. అందరూ ఆయన ఎక్కడ.. ఎక్కడ అని అంటున్నారు.. ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మిట్ట మధ్యాహ్నం ఎండకి చెట్టు కింద పొలం పనులు చేయిస్తు సేద తీరుతున్న తీరు చూస్తుంటే.. ఆయనకు పంట మీద ఎంత ప్రేముందో తెలుస్తుంది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుండి “ఇదే నిజం”కు అందిన చిత్రం మీ కోసం.