Homeహైదరాబాద్latest NewsBREAKING: వైయస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అతను చేయలేదట..సీబీఐ కోర్టు సంచలన ప్రకటన..!

BREAKING: వైయస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అతను చేయలేదట..సీబీఐ కోర్టు సంచలన ప్రకటన..!

ఇదే నిజం, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైయస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం సీబీఐ కోర్టులో వివేకా హత్యకేసు విచారణ జరిగింది. నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగిస్తున్నట్లు సీబీఐ కోర్టు తెలిపింది. తనను సాక్షిగా పరిగణించాలంటూ నాలుగో నిందితుడిగా ఉన్న షేక్‌ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను అప్రూవర్‌గా కోర్టు అనుమతించినందున నిందితుల జాబితా నుంచి తొలగించాలని, సాక్షిగా మాత్రమే పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు. ఇప్పటికే సీబీఐ అధికారులు దాఖలు చేసిన అభియోగ పత్రంలో తనను సాక్షిగా చేర్చినట్టు కోర్టుకు తెలిపారు. దస్తగిరి తరఫు న్యాయవాది వాదనను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి దస్తగిరిని తొలగిస్తున్నట్టు తెలిపింది. ఈ కేసులో దస్తగిరి ఐదేళ్ల పాటు జైలులో ఉన్నాడు. అప్రూవర్‌గా మారడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ తో దస్తగిరి ప్రస్తుతం బయటే ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దస్తగిరి కడప పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు.

Recent

- Advertisment -spot_img