ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంలో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె ఈ రోజు రాత్రికి ముంబై నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ పోలీసులు రక్షణతో ఆమెను విజయవాడకు తీసుకెళ్లే అవకాశం ఉంది. వైసీపీ టార్చర్ వ్యవహారానికి సంబంధించి కాదంబరి జెత్వానీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలని విజయవాడ పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను తీసుకొస్తున్నట్లు సమాచారం.