ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావుకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. కాగా.. ట్యాపింగ్ కేసులో A-2గా భుజంగరావు ఉన్నారు.