– గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసనసభ 20 వ తేదీకి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. తీర్మానం ఆమోదం తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారానికి శాసనసభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం జరిగింది.