Homeహైదరాబాద్latest NewsBREAKING: మల్లారెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత..!

BREAKING: మల్లారెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత..!

ఇవాళ ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇవాళ వాగ్వాదానికి దిగారు. అయితే ఆ స్థలం తమదేనంటూ కొందరు వారిద్దరినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక సమాచారంతో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై మాల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు.

Recent

- Advertisment -spot_img