సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. తన మనవరాలు పెళ్లి పత్రికను అందించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కాగా రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహా ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే.