Homeహైదరాబాద్latest NewsBREAKING: పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఫొటోస్ వైరల్

BREAKING: పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఫొటోస్ వైరల్

తిరుమల శ్రీవారి ఆలయంలో టాలీవుడ్ హీరో తిరువీర్‌ పెళ్లి చేసుకున్నాడు. కల్పనారావ్‌ అనే అమ్మాయితో ఆదివారం (ఏప్రిల్‌ 21న) ఏడడుగులు వేశాడు. కొత్త జీవితం ప్రారంభం.. అంటూ తన పెళ్లి సెలబ్రేషన్‌ ఫోటోలను తిరువీర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది చూసిన సినీతారలు, అభిమానులు.. నటుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తిరువీర్‌ స్వస్థలం.. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి. మొదట్లో రేడియో జాకీగా పని చేశాడు. ఆర్జే తిరూ అంటూ శ్రోతలను పలకరించిన అతడు బొమ్మలరామారం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఆచితూచి సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ హీరో మసూద, పరేషాన్‌ వంటి చిత్రాలతో బాగా క్లిక్కయ్యాడు. జార్జ్‌ రెడ్డి, పలాస సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img