Homeహైదరాబాద్latest NewsBREAKING: ఓటరు‌ను కొట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి.. ఈసీ సీరియస్

BREAKING: ఓటరు‌ను కొట్టిన ఎమ్మెల్యే అభ్యర్థి.. ఈసీ సీరియస్

గుంటూరులోని తెనాలిలో ఓటింగ్ కార్యక్రమంప్రశాంతంగా సాగుతున్న క్రమంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా బత్తుల శివ కుమార్ ఓటు వేయడానికి వచ్చారు. ఆయన క్యూలైన్ ను ఫాలో అవ్వకుండా నేరుగా, పోలింగ్ కేంద్రంలోపలికి ఓటు వేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక ఓటరు క్యూలైన్ లో రావాలి కదా అని చెప్పాడు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన అన్నా బత్తుల శివ కుమార్ తనకే నీతులు చెప్తావా.. అంటూ అతనిపై దాడికి దిగాడు. సదరు ఓటరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా బత్తుల శివ కుమార్ చెంప ఛెళ్లు మన్పించారు. ఎమ్మెల్యే అనుచరులు ఓటరుపై దాడికి దిగారు. చుట్టుపక్కల ఉన్న పోలీసులు.. వారిని ఆపే ధైర్యం మాత్రం చేయలేదు. పోలింగ్ బూత్ వద్ద ఓటరును చెంపపై కొట్టిన తెనాలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శివకుమార్‌పై ఈసీ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ ముగిసే వరకూ ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భందించాలని ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img