బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మర్డర్ కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురి పేర్లను చేర్చారు. అల్లర్ల సమయంలో జరిగిన కాల్పుల్లో మొహమ్మద్‌పుర్‌లోని ఓ కిరాణ దుకాణ యజమాని అబుసయ్యద్ మరణించాడు. అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణమని ఆరోపిస్తూ సయ్యద్ సంబంధికుల్లో ఒకరు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెతో పాటు మరో ఆరుగురిపైనా కేసు నమోదైంది.