మాజీ సీఎం జగన్‍పై కేసు నమోదు నమోదయ్యింది. జగన్‍తో పాటు సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ పై కేసు చేశారు. గుంటూరులో కస్టడీలో ఉన్న సమయంలో తనపై హత్యాయత్నం చేశారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుతో నగరంపాలెం పీఎస్ లో కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506(34) ప్రకారం కేసు నమోదు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ కేసులో ఏ3గా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు, ఏ2గా ఐపీఎస్ అధికారి సీతారాంజనేయులు, ఏ4గా విజయపాల్, ఏ5 గా డాక్టర్ ప్రభావతి పేరు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారని రఘురామ నిన్న ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.