ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. అనారోగ్యంతోనే పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. వరద తగ్గిన చోట పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు సురక్షిత తాగునీరు అందించాలని.. దోమల బెడద లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.