Homeహైదరాబాద్latest NewsBreaking News: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..!(వీడియో)

Breaking News: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..!(వీడియో)

Breaking News: ఢిల్లీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆరో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మంటల్లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Recent

- Advertisment -spot_img