పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇంట్లో నేడు పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీసుకు తరలించారు. పాల్వాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసంతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీసుకు తరలించారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా పలు కేసులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించడం, టీడీపీ ఏజెంట్లపై దాడి, వాహనాల ధ్వంసం వంటి కేసులు మాజీ ఎమ్మెల్యే సోదరుడిపై నమోదయ్యాయి. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.