ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య తోపులాటతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ ఇంటి ఎదుట గాంధీ, అనుచరులు ధర్నాకు దిగడంతో పోలీసులు అరికెపూడిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఆందోళన చేస్తున్న ఇరువర్గాల కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.