Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS : వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అరెస్ట్..!

BREAKING NEWS : వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ అరెస్ట్..!

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ – ఎస్టీ అట్రాసిటీ కింద కూడా కేసులు నమోదు చేశారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రానుంది. అయితే వైసీపీ మాత్రం వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేశారని, పక్కా ప్లాన్ ప్రకారమే ఇది జరిగిందని ఆరోపించింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి ముందస్తు బెయిల్ ఉందని గుర్తు చేసింది. ఆ దాడిపై ఫిర్యాదును ఇటీవల సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారని గురువారం ట్వీట్ చేసింది. కానీ వంశీని కూటమి నేతలు టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించింది.

Recent

- Advertisment -spot_img