వైసీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అప్పిరెడ్డిని గుంటూరులో పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అప్పిరెడ్డిని పోలీసులు మంగళగిరి తీసుకొస్తున్నారు. మరికొందరు వైసీపీ కీలక నేతలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.