జనసేన అధినేత పవన్ కల్యాణ్ 69,169 ఓట్ల మెజారిటీతో పిఠాపురంలో ఘన విజయం అందుకున్నాడు. దీంతో మంగళవారం ఆయన కాకినాడ రానున్నారు. ఇప్పటికే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారు. కౌంటింగ్‌లో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుండటంతో ఆయన కాకినాడ వస్తున్నారు. జిల్లా నాయకులతో కలిసి ఆయన కౌంటింగ్ విశేషాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి టీడీపీ 133, జనసేన 21, బీజేపీ 7, వైసీపీ 14 స్థానాల్లో ముందందజలో ఉన్నాయి.