తెలంగాణాతల్లి విగ్రహావిష్కరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 9వ తేదీన సచివాలయంలో 20 అడుగుల తెలంగాణాతల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. సచివాలయంలో విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ కోరారు. త్వరలోనే పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఇంతకాలం మౌనంగా ఉన్న జూలూరి విగ్రహావిష్కరణకు 48 గంటల ముందు అభ్యంతరం చెప్పడంలో ఆంతర్యం అర్థం కావడంలేదు.