Homeహైదరాబాద్latest NewsBREAKING: ఆక్సిడెంట్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

BREAKING: ఆక్సిడెంట్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిలో ప్రముఖ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు(48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్‌ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు కారును స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు.. వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టారు. దీంతో జనార్దన్‌రావు ఎగిరి డివైడర్‌ మీద పడ్డారు. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. జనార్దన్‌రావు భార్య నాగమణి ఫిర్యాదుతో రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img