ప్రముఖ బెంగాలీ దర్శకుడు ఉత్పలేందు చక్రవర్తి(76) కన్నుమూశారు. రీజెంట్ పార్స్లోని తన నివాసంలో గుండెపోటుతో తిదిశ్వాస విడిచారు. ఉత్పలేందు చక్రవర్తి 1983లో చోఖ్ చిత్రానికి ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. 1981 సంవత్సరంలో తన తొలి చిత్రానికే ఇందిరా గాంధీ అవార్డు వరించింది. ఆయన మృతికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు.