కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల విడిపోతుంటారు. అందులో మలయాళ హీరోయిన్ ‘భామ కురుప్’ కూడా చేరింది. 2020లో అరుణ్ జగదీశ్‌ను పెళ్లాడింది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే మానేసింది. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో ‘మంచివాడు’ అనే మూవీలో హీరోయిన్‌గా నటించింది.