జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి మంత్రి అయిన పవన్‌కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.