ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నటి పూనమ్ సంచలన ఆరోపణలు చేసింది. “అతడి వేధింపులపై గతంలో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాను. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడైనా ఈ విషయంపై త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలి” అని ట్వీట్ చేసింది. పూనమ్ ఫిర్యాదు చేసేంతలా త్రివిక్రమ్ ఏం చేశారనేది హాట్ టాపిక్ అయింది.