వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ప్రస్తుతం సునీత వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.