Homeహైదరాబాద్latest NewsBREAKING: సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం.. ఫొటోస్ వైరల్

BREAKING: సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం.. ఫొటోస్ వైరల్

తాజాగా సినీ సెలబ్రెటీల ఇళ్లలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. గత ఏడాది నుంచి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన హీరో హీరోయిన్లు, సీనియర్ నటుల వారుసుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలకు తండ్రి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ప్రముఖ నటుడు జయరాం కుమార్తె మాళవిక జయరాం వివాహం సింపుల్‌గా జరిగింది. నవనీత్‌ గిరిశ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌లోని ఓ గుడిలో వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులతో పాటు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి ఫొటోలు బయటకురాగా నూతన వధూవరులకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈవాళ సినీ ప్రముఖుల కోసం భారీగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు.

Recent

- Advertisment -spot_img