హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్ ముందు శనివారం ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మహిళా కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్‌ను ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అక్కడి చేరుకున్న పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. కాగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.