టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై ఓ హోటల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది. అతడు చేసిన అఘాయిత్యానికి సంబంధించి ఆధారాలు అన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపింది. తన ఫ్యామిలీని చంపేస్తానని ఆదిమూలం బెదిరించడంతో అతడికి లొంగిపోయానని వెల్లడించింది. తరుచూ తనకు ఫోన్ చేస్తూ వేధించాడని పేర్కొంది. దీంతో తాను వీడియో రికార్డు చేసి బయట పెట్టానని తెలిపింది.