బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన భారీ కుట్ర దర్యాప్తులో బయటపడింది. ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటన కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మొత్తం ఐదుగురు నిందితులపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలపై ముంబై పోలీసులు కొత్త ఛార్జిషీట్ దాఖలు చేశారు. రూ.25లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ను హత్య చేయాలనుకున్నారని ఛార్జిషీట్లో పేర్కొన్నారు.