వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై గ్రామస్తులు దాడి చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకున్నారు. ఫార్మా విలేజ్ భూసేకరణపై చర్చించేందుకు కలెక్టర్, తహశీల్దార్ దుద్యాలమండలం లగవర్ల గ్రామానికి వెళ్లారు. ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు మండిపడ్డారు. వారి అభ్యంతరంతో గ్రామానికి వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, తహశీల్దార్ పై రైతులు, గ్రామస్థులు దాడి చేశారు. అధికారుల వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి.