అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మదనపల్లిలోని శ్రీవారి నగర్‌కు చెందిన పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న ఆయనపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో హతమార్చి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పుంగనూరు శేషాద్రి వైసీపీ కార్యకర్తగా ఉన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు శేషాద్రిని చంపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.