ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయాన్ని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడికి యత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీస్ పై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారి పరస్పరం కర్రలతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.