ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈరోజు దొంతపూర్ గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది గర్భిణీలు మరియు బాలింతల కు తల్లిపాల పైన అవగాహన కల్పించారు. మొదట వచ్చే పాలు బిడ్డకి ఒక సంజీవని లాగా అమృతంలాగా రెండు సంవత్సరంల వరకు కూడా ఎటువంటి వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయని తెలియజేశారు..బిడ్డకి పాలు పట్టే విధానం కూర్చుని ఇచ్చే పొజిషన్ గురించి తెలియజేశారు. అలాగే పల్లె దవాఖాన డాక్టర్ దివ్య మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచనలను తెలియజేశారు. ఆ పాలలో ఎంత శక్తి ఉంటుందో తెలియజేశారు. గర్భిణీ స్త్రీలకు సీమంతం ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు చేశారు. ఇందులో ధర్మపురి ప్రాజెక్ట్ అధికారిని శ్రీమతి వాణిశ్రీ ఐసిడిఎస్ సూపర్వైజర్ పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్స్ ఆశ ఏఎన్ఎం గర్భిణీలు బాలింతలు రెండు సంవత్సరాలు పిల్లల తల్లులు కార్యక్రమంలో పాల్గొన్నారు.