భూపాలపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. ఈదురుగాలులకు వంతెన గడ్డర్లు కూలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య వంతెన నిర్మాణం గత ఆరేళ్లుగా కొనసాగుతోంది.