Homeఅంతర్జాతీయంBritan : బ్రిటన్ బాద్ షా (ప్రధాని )గా రుషి సునాక్

Britan : బ్రిటన్ బాద్ షా (ప్రధాని )గా రుషి సునాక్

Britan:

అప్పనంగా సంపాదించింది ఏదీ శాశ్వతం కాదు. అన్యాయంగా, అహంకారం తో చెలాయించిన పెత్తనం కడదాకా నిలవదు. ఇపుడు బ్రిటన్ విషయంలో జరుగుతున్నది అదే. బానిసలని భారతీయులను హింస పెట్టారు. చిన్న చూపు చూశారు. గేలి చేశారు. వ్యాపారం ముసుగులో వచ్చి అడ్డదారిలో అధికారం దక్కించుకున్నారు. సిరి_సంపదల నెలవైనా భారత దేశాన్ని అందినకాడి కి దోచుకుని, దాచుకున్నారు . అదే అక్రమ సొత్తుతో ఇన్నాళ్లూ డాబులకు పోయారు . కానీ ఏమైంది …!? రవి అస్తమించిని బ్రిటీష్ సామ్రాజ్యం కాస్త రాజు లేని రాజ్యమైంది . కొల్లగొట్టిన సొమ్ము తరిగిపోయాక, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. చక్కదిద్ద లేక ప్రధానులే పారిపోయి , బ్రిటన్ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది..॥
బానిసత్వ నుంచి బయటపడి, స్వశక్తితో భారత దేశం 75 ఏళ్ల లో అంచలంచలుగా ఎదుగుతోంది. కానీ బ్రిటన్ ఈ 75 ఏళ్లలో పాతాళానికి పడిపోయింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని పదవి చేపట్టేందుకు ఆ దేశ నాయకులెవ్వరూ సాహసించని దుస్థితి నెలకొంది . అప్పుడే మెరిసిన ఓ మెరుపు రిషి సునాక్. భారత మూలాలున్న యోధుడు . ఎవరిని బానిసలని అన్నారో , అదే రక్తం కలిగిన ఓ భారత సంతతి బిడ్డ. ఇపుడు అదే బ్రిటన్ కు ప్రధాని అయ్యాడు. ఇది కదా అసలైన దీపావళి . ఇది కదా భారతీయుని అసలు-సిసలు స్వాతంత్ర్య వజ్రోత్సవం.
వజ్ర-వైఢూర్యాలు ఎత్తుకెళ్లారు. ధన-కనక వస్తువులను తరలించుకుపోయారు. మన ఘన చరిత్ర మనకు దక్కకుండా చిధ్రం చేశారు . కానీ నాయకత్వ లక్షణాలను , రాజ్యాలను ఏలగలిగలే రాజసాన్ని మాత్రం ఏమీ చేయలేక బ్రిటీష్ పాలకులు చేతులెత్తేశారు. ఆ నాయకత్వపు పరంపరలో రిషి సునాక్ ఒక చరిత్ర. ఎవ్వరూ చెరిపేయలేని శిలాక్షరం .

జయహో భారతీయుడా జయహో .
నిన్న దాయాది మీద విజయం
నేడు పాలించినోడి మీదే, మనోడి పెత్తనం ..
గర్వంగా ఉంది భారతీయుడినైనందుకు .
జయహో భారత్..🇮🇳🇮🇳🇮🇳

Recent

- Advertisment -spot_img