Homeఆంధ్రప్రదేశ్bro movie: బ్రో మూవీకి అంబటి ప్రమోషన్..

bro movie: బ్రో మూవీకి అంబటి ప్రమోషన్..

bro movie: ఇదే నిజం, సినిమా: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బ్రో మూవీపై ఇటీవల తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. బ్రో మూవీలో తనను కించపరిచేలా శ్యాంబాబు అనే క్యారెక్టర్ ను రూపొందించారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. పవన్ కల్యాణ్ వర్సెస్ అంబటి అన్నట్టుగా ఫైట్ జరిగింది. ఇక సోషల్ మీడియాలోనూ వైసీపీ వర్సెస్ జనసేన నేతల మధ్య వార్ జరిగింది.

కాగా ఈ పంచాయితీ సినిమా ప్రమోషన్ కు బాగా ఉపయోగపడిందన్న చర్చ జరుగుతోంది. బ్రో మూవీ మీద తొలుత కొంచెం మిక్స్ డ్ టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా కొద్దిగా తగ్గాయి. కానీ అంబటి వివాదంతో మళ్లీ కలెక్షన్లు పెరుగుతున్నయన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అంబటి రాంబాబు వివాదం సినిమాలకు బాగా ఉపయోగపడింది.

Recent

- Advertisment -spot_img