bro movie:ఇదేనిజం, ఢిల్లీ: బ్రో సినిమాపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాకు పెట్టుబడులు ఎవరు పెట్టారు? ఎంత డబ్బు ఖర్చుపెట్టి ఈ మూవీని నిర్మించారు. తదితర అంశాలపై అంబటి రాంబాబు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంప్లైంట్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా బ్రో సినిమాపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఇటు అంబటి రాంబాబు, అటు పవన్ కల్యాణ్ అభిమానుల సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.