HomeతెలంగాణBrs:బీఆర్ఎస్​పై ప్రతీకారం తీర్చుకుంటా..

Brs:బీఆర్ఎస్​పై ప్రతీకారం తీర్చుకుంటా..

– ఎస్టీ కాని వ్యక్తికి ఖానాపూర్​ టికెట్​ ఎలా ఇచ్చారు?
– జాన్సన్​ నాయక్​ కన్వర్టెడ్​​ క్రిష్టియన్​
– ఎమ్మెల్యే రేఖానాయక్​ సంచలన ఆరోపణ

ఇదేనిజం, ఆదిలాబాద్​: బీఆర్ఎస్​ టికెట్​ దక్కని ఎమ్మెల్యే రేఖానాయక్​ సంచలన ఆరోపణ చేశారు. తాను బీఆర్ఎస్​ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశారు. అసలు ఎస్టీ కానీ జాన్సన్​ నాయక్​ కు టికెట్​ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. జాన్సన్​ నాయక్​ కన్వర్టెడ్​ క్రిష్టియన్​ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలనూ తాను దృష్టి పెట్టబోతున్నారని చెప్పారు. ఆమె భర్త శ్యాం నాయక్ సైతం వీఆర్ఎస్​ తీసుకున్నారు. దీంతో ఆయన కోసం రాజకీయాలపై ఫోకస్​ పెట్టారు. రేఖా నాయక్​ దంపతులిద్దరూ కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. ఆసిఫాబాద్​ లేదా ఖానాపూర్​ ఏదో ఒక టికెట్​ ఇస్తామని కాంగ్రెస్​ నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని రేఖా నాయక్ అంటున్నారు.

Recent

- Advertisment -spot_img