బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందా? లేదా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని జోరుగా ప్రచారం సాగింది. గత మునుగోడు ఉప ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశారు. అయితే తాజాగా కమ్యూనిస్టులను కేసీఆర్ పెద్దగా పట్టించుకోవడం లేదని సమాచారం. సీఎం అపాయింట్ మెంట్ కోసం కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నా.. కేసీఆర్ నుంచి రెస్పాన్స్ రావడం లేదట.
కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించలేమని.. అవసరమైతే ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని బీఆర్ఎస్ నుంచి ప్రపోజల్ వచ్చిందని టాక్. కానీ కమ్యూనిస్టులు మాత్రం తమకు పట్టున్న జిల్లాల్లో సీట్లు కేటాయించాలని అడుగుతున్నారట. దీంతో వాపపక్షాలతో బీఆర్ఎస్ తో పొత్తుపై సందిగ్ధం నెలకొన్నది. వామపక్షాలతో పొత్తు వద్దని కీలకనేతలు కేసీయార్ కు భావిస్తున్నారని టాక్.
ఒకవేళ పొత్తు పెట్టుకున్నా.. వామపక్షాల నుండి బీఆర్ఎస్ కు ఓట్లు బదిలీ కావని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. పొత్తుపెట్టుకుని నష్టపోవటం తప్ప ఉపయోగంలేదని స్పష్టంగా చెప్పారని కారుపార్టీ నేతల సమాచారం. అందుకనే కేసీయార్ కూడా రెండో ఆలోచనకు వచ్చినట్లు పార్టీలో టాక్. ఈ కారణంగానే వామపక్షాలను దూరంగా పెడుతున్నారట. మరి ఇలా ఎంతకాలం ఏదీ తేల్చకుండా దూరంపెడతారో కేసీయార్ కే తెలియాలి. మొత్తంమీద కేసీయార్ ఆలోచను చూస్తుంటే పొత్తుల విషయంలో కమ్యూనిస్టులను వెయిటింగ్ లిస్టులో పెట్టినట్లే అనిపిస్తోంది.