ఇదే నిజం, జోగిపేట : భారత రాష్ట్ర సమితి ఆవిర్బావ దినోత్సవాన్ని జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మికాంతరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షుడు జోగు బాలయ్య, మాజీ కౌన్సిలర్ తుపాకుల సునీల్, పట్టణ మాజీ అధ్యక్షుడు సీహెచ్.వెంకటేశం, మాజీ ఎంపీటీసీ డీ.వీరభద్రారావు, నాయకులు మహేష్ యాదవ్, బీర్లశంకర్, గోపాల్, మైనార్టీ నాయకుడు ఖాజాపాష, వీరేశంలతో పాటు పలువురు పాల్గొన్నారు.