Homeహైదరాబాద్latest NewsBRS : ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో హల్ చల్

BRS : ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో హల్ చల్

– మరోసారి ఎన్నికల రూల్ బ్రేక్ చేసిన జూబ్లీహిల్స్​ బీఆర్ఎస్​ అభ్యర్థి మాగంటి గోపినాథ్

ఇదే నిజం, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరోసారి ఎన్నికల రూల్స్​ను బ్రేక్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్వార్లతో హల్‌చల్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో కార్యకర్తలు హంగామా సృష్టించారు. ఎర్రగడ్డ వద్ద ఎన్నికల ప్రచారంలో తల్వార్లతో విన్యాసాలు చేశారు. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోను స్వయంగా ఎమ్మెల్యే మాగంటి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇలా పోటీ చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ఈ విన్యాసాలు జరిగే సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా అడ్డుకోకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల రూల్స్​కు విరుద్ధంగా ఆయుధాలు వాడటం ఏంటని ప్రశ్నిస్తూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్​కు ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img