Homeహైదరాబాద్latest Newsపార్లమెంటు ఎన్నికల్లో BRSకు హవా !

పార్లమెంటు ఎన్నికల్లో BRSకు హవా !

  • 8 సీట్లు తెచ్చుకోనున్న గులాబీ పార్టీ
  • బీజేపీకి 6 స్థానాలు
  • రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం
  • ఒక్క స్థానాన్ని నిలబెట్టుకోనున్న మజ్లీస్
  • పార్లమెంటు ఎన్నికలపై ఇండియా టీవీ లేటెస్ట్ సర్వే

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: లోక్ సభ ఎన్నికలపై తాజాగా ఇండియా టీవీ ఒపినియన్ పోల్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలు దక్కించుకుకోనున్నది. ఇక బీజేపీ ఆరు స్థానాలు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతుందని ఈ సర్వే చెబుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. ఇక బీజేపీ ఎనిమిది చోట్ల గెలుపొందింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి ఈ ఫలితాలు మొత్తం తారుమారు అవుతాయని ఇండియా టీవీ సర్వే చెబుతోంది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది. మరి ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img