Homeహైదరాబాద్latest NewsBRS రద్దయిన నోటు లాంటిది

BRS రద్దయిన నోటు లాంటిది

ఇదే నిజం, గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి రద్దయిన నోటులా మారిందని, పాత ముఖ్యమంత్రి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పలిగిపోయిందని, చితికిపోయిందని, కృంగిపోయిందని మందిని తోలుకొని పోయి విహారయాత్రలా కాళేశ్వరంను చూయిస్తున్నారే తప్ప తానేం చేస్తాననేది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కే వెంకట రమణారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా శనివారం గోదావరిఖనికి చేరుకున్న విజయ సంకల్ప యాత్రలో ఆయన మాట్లాడారు. ఆరు ఉచిత హామీ పథకాల ఆశ చూపి ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ ఇప్పటివరకు జనాలకు చేసిందేమీ లేదని, చైనాకు ముక్కుతాడు వేయాలన్న, పాకిస్తాన్ ఆటలు కట్టడి చేయాలన్న మళ్లీ నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధాన మంత్రి కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి ఎంపీగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చెందుమల్ల సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి, మెరుగు హనుమంత్ గౌడ్, బల్మూరి వనిత తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img